Monday, July 15, 2024

మహేష్ మేనల్లుడు ‘హీరో’ టైటిల్, టీజర్ సూపర్

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. గల్లా జయదేవ్ స్వయంగా ఓన్ ప్రొడక్షన్ హౌస్ ద్వారా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ నిధి అగర్వాల్ అశోక్ సరసన నటిస్తోంది. ఇక ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ కి సంబంధించిన టైటిల్ టీజర్ ను తాజా గా సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు. అలాగే చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. టీజర్ లో కౌబాయ్ గెటప్ తో పాటు జోకర్ గెటప్ లో కూడా అశోక్ కనిపించారు. ఈ సినిమాకు ‘ హీరో ‘ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. అలాగే ఈ సినిమాకు జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement