Wednesday, May 1, 2024

స్టూడెంట్ డేట్ ఫిక్స్ ..

‘స్వాతిముత్యం’ సినిమాతో అరంగేట్రం చేసిన బెల్లంకొండ గణష్‌ ఇప్పుడు ‘నేను స్టూడెంట్‌ సార్‌’తో థ్రిల్‌ ఇవ్వడానికి సిద్ధమవు తున్నాడు. ఈ చిత్రానికి రాఖీ ఉప్పలపాటి దర్శకత్వం వహించగా, ‘నాంది’ సతీష్‌ వర్మ నిర్మించారు. యాక్షన్‌ థ్రిల్లర్‌ గా రూపొందిన ఈ సినిమా టీ-జర్‌ పై మంచి అంచనాలు నెలకొల్పగా, ఫస్ట్‌ సింగిల్‌ కి కూడా మంచి ఆదరణ లభించింది.
తాజాగా ఈ చిత్రం కొత్త విడుదల తేదీకి సంబంధించి వివరాలు ప్రకటించారు నిర్మాత. ‘నేను స్టూడెంట్‌ సార్‌’! జూన్‌ 2న థియేట్రికల్‌ రిలీజ్‌ అవుతుంది.
బెల్లంకొండ గణష్‌, అవంతిక దస్సాని సహా ప్రముఖ తారాగణం ఉన్న పోస్టర్‌ ద్వారా మేకర్స్‌ ఈ ప్రకటన చేశారు.
సముద్రఖని, సునీల్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కృష్ణ చైతన్య కథ అందించిన ఈ చిత్రానికి మహతి స్వర సాగర్‌ సంగీతం అందించారు. అనిత్‌ మాదాడి కెమెరామెన్‌ గా పని చేస్తుండగా, చోటా కె ప్రసాద్‌ ఎడిటర్‌, కళ్యాణ్‌ చక్రవర్తి డైలాగ్స్‌ అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement