Saturday, June 29, 2024

Sreeleela మ‌ళ్లీ లైమ్ లైట్ లోకి శ్రీలీల‌….

టాలీవుడ్‌ ప్రేక్షకులకు కొత్త ‘పెళ్లి సందడి’ సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్రీలీల. మొదటి సినిమా డిజాస్టర్ అయినా కూడా లక్కీగా టాలీవుడ్ లో మంచి ఆఫర్లు దక్కాయి. ధమాకా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం వల్ల శ్రీలీల ఒకే సారి డజను సినిమా ఆఫర్లను సొంతం చేసుకుంది.

మహేష్ బాబు కు జోడీగా గుంటూరు కారం సినిమాలో నటించే అవకాశం సొంతం చేసుకుంది. ఆ మధ్య బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ పడటంతో స్లో అయిన శ్రీలీల మళ్లీ స్పీడ్ పెంచింది. బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతుంది.

ప్రస్తుతం ఈమె చేతిలో నాలుగు అయిదు సినిమాలు ఉన్నాయట. ఈసారి బిగ్ చాలెంజ్ కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా తమిళంలో కూడా ఈ అమ్మడు సినిమాలు చేస్తుంది. కన్నడంలో ఈ అమ్మడికి పెద్ద హీరోలకు జోడీగా నటించే అవకాశాలు వస్తున్నాయని సమాచారం అందుతోంది.

మొత్తానికి శ్రీలీల బిజీ బిజీగా ఉంది. తాజాగా ఈ అమ్మడు ఒక చిట్‌ చాట్‌ లో ఆసక్తికర విషయాలను వెళ్లడించి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. కెరీర్‌ లో ఇంతగా సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి, మీరు పాటించే ప్రణాళికలు ఏంటి అన్నట్టుగా ప్రశ్నించిన సమయంలో అలాంటివి ఏమీ లేవు అన్నది.

ప్రతి అవకాశం ను సద్వినియోగం చేసుకోవడం కోసం కష్టపడాలని కొత్త వారికి శ్రీలీల సలహాలు ఇచ్చింది. ఇటీవలే ఈ అమ్మడు రవితేజ సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు ఎంపిక అయ్యింది. మరో వైపు పవన్‌ మూవీలో కూడా ఈ అమ్మడు నటించబోతున్న విషయం తెల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement