Wednesday, June 19, 2024

ఎన్టీఆర్ చెర్రీ పై స్పెషల్ సాంగ్…ఆర్ఆర్ఆర్ హైలెట్

బాహుబలి సినిమా తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్ . ఈ సినిమాలో ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోలుగా నటిస్తున్నారు. కొమురం భీంగా ఎన్టీఆర్ అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ కనిపించబోతున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. కాగా ప్రస్తుతం కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.

ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ రామ్ చరణ్ కాంబినేషన్లో ఓ ప్రత్యేకమైన పాట ఈ సినిమాలో ఉండబోతుందట. ఇది షూటింగ్ లు తిరిగి ప్రారంభమైన వెంటనే మొదట చిత్రీకరించనున్నారని… అలాగే రామ్ చరణ్ అలియాభట్ కాంబినేషన్ లో మరో పాటను కూడా షూట్ చేయబోతున్నారట. కాగా ఈ సినిమాను డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement