Saturday, April 20, 2024

ఎయిర్ గన్ కలకలం… చంపేస్తానంటూ డిప్యూటీ తాహసీల్దార్ హల్ చల్

వికారాబాదులో ఎయిర్ గన్ కలకలం రేపింది. షేక్ ఫయాజ్ అనే వ్యక్తి మద్యం మత్తులో ఎయిర్ గన్ పట్టుకొని హల్చల్ సృష్టించాడు. వికారాబాద్ డిప్యూటీ తాహసీల్దారు సివిల్ సప్లైస్ లో ఫయాజ్ పని చేస్తున్నాడు. నిన్న రాత్రి మద్యం సేవించి అనంతరం మద్యం మత్తులో ఇంటి పక్కన ఉన్న టోనీతో ఫయాజ్ వాగ్వాదానికి దిగాడు. ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన ఫయాజ్ ఒక్కసారిగా ఎయిర్ గన్ తీసుకో వచ్చి కలకలం రేపాడు. గన్‌తో కాల్చి చంపేస్తామంటూ హల్చల్ సృష్టించాడు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. షేక్ ఫయాజ్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement