Wednesday, May 15, 2024

Sobhita Dhulipala : శోభిత కిల్లర్ లుక్స్…

శోభితా ధూళిపాళ.. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్పుడు వరుస సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతోంది. 2016లో అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన రామన్ రాఘవ్ 2.0తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిందీ బ్యూటీ. ఆ తర్వాత అడవి శేష్ హీరోగా యాక్ట్ చేసిన మేజర్ సినిమాలో కీలక పాత్రలో నటించి ఆకట్టుకుంది. ఇక కోలీవుడ్ లో పొన్నియన్ సెల్వన్ రెండు పార్టుల్లో నటించి మంచి పేరు సంపాదించుకుంది.

- Advertisement -

అయితే శోభిత పలు ఓటీటీ ప్రాజెక్టులతో బాగా ఫేమస్ అయింది. మేడ్ ఇన్ హెవెన్, బర్ద్ ఆఫ్ బ్లడ్, ది నైట్ మేనేజర్ వంటి బాలీవుడ్ వెబ్ సిరీసులతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పటికే ఓ హాలీవుడ్ సినిమా చేస్తుండగా.. అక్కడ కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి ఈ తెలుగమ్మాయికి. ఆంధ్రప్రదేశ్ లోని తెనాలిలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ.. ఓ రేంజ్ లో గ్లామర్ షో చేస్తోంది. ట్రెండీ ఔట్ ఫిట్స్ లో అలరిస్తుంటోంది.
తాజాగా శోభిత.. బ్రైడ్స్ టుడే మ్యాగ్ జైన్ పై దర్శనమిచ్చింది. రెడ్ కలర్ స్టైలిష్ డ్రెస్ లో స్టూల్ పై కూర్చుని సెగలు పుట్టించింది. తన లుక్స్ తో ఒక్కసారిగా నెట్టింట హీటెక్కించింది. ఆమె ధరించిన నెక్ సెట్.. ఆమె అందాన్ని మరింత పెంచింది. మ్యాగ్ జైన్ పై శోభిత పిక్ తోపాటు బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అని కూడా రాసి ఉంది. అయితే ఈ పిక్ ను బ్రైడ్స్ టుడే తన అఫీషియల్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement