Saturday, April 13, 2024

శ్రీకారం సినిమా ప్రొడ్యూసర్స్ కి శర్వానంద్ లీగల్ నోటీసులు

హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ఉంటారు యంగ్ హీరో శర్వానంద్. ఇటీవల శర్వానంద్ శ్రీకారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు బి కిషోర్ అనే దర్శకుడు కొత్తగా పరిచయం అయ్యాడు. ఇక ఈ సినిమాలో శర్వానంద్ అలాగే ప్రియాంక అరుల్ మోహన్ జంటగా నటించారు. ఈ సినిమా 14 రీల్స్ సంస్థ నిర్మించింది. మహాశివరాత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అనుకున్న స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది.

ఇదిలా ఉండగా ఈ చిత్రానికిగాను ముందుగా ఆరు కోట్ల రెమ్యూనరేషన్ తో పాటు 50 శాతం లాభం తీసుకొనున్నట్టుగా నిర్మాతలతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడట శర్వానంద్. అయితే సినిమా విడుదలకు ముందే అతనికి నాలుగు కోట్ల రూపాయలను చెల్లించారట. మిగిలిన రెండు కోట్ల రూపాయల పోస్ట్ డేటెడ్ చెక్కును ఇచ్చారట. అయితే ఆ చెక్కులు బౌన్స్ అవడంతో శర్వానంద్ నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపినట్లు సమాచారం. మరి ఈ వివాదం ను నిర్మాతలు సామరస్యంగా పరిష్కరించుకుంటారా…లేక లీగల్ గా ముందుకు వెళ్తారా అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement