Wednesday, May 1, 2024

కట్టిపడేసిన భావోద్వేగం

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న హీరోల లో శర్వానంద్ కథను ఎంచుకోవడంలో కొత్తదనం చూపిస్తూ ఉంటారు. మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, శతమానంభవతి,మహానుభావుడు వంటి చిత్రాలతో అలరించిన శర్వానంద్ ఇప్పుడు శ్రీకారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆధునిక వ్యవసాయం యువత వ్యవసాయం లోకి రావాలని చెప్పే సబ్జెక్టుతో ఈ సినిమా ద్వారా శర్వానంద్ వచ్చాడు. 14 రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట ఈ సినిమాని నిర్మించారు. అదే విధంగా ఈ సినిమాలో శర్వానంద్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ నటించారు. ఇక ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా చూసిన వారంతా కూడా శర్వా ను అభినందించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఫస్టాఫ్ కాస్త సాధారణంగా సాగినప్పటికీ సెకండాఫ్ మాత్రం భావోద్వేగ సన్నివేశాల తో ప్రేక్షకులను కట్టి పడేస్తాయని చెబుతున్నారు. అయితే మొదటి భాగం 30 నిమిషాల ముందు వరకు అంతగా ఏమీ లేకపోయినప్పటికీ ఆఖరి 30 నిమిషాలు కనెక్ట్ అవుతారట. ఉద్యోగం వస్తే అమ్మని బాగా చూసుకుందామని అనుకున్నాను రా…. ఇప్పుడు ఉద్యోగం తప్ప ఇంకేమీ చేసుకోలేక పోతున్నా అంటూ మురళీశర్మ చెప్పే డైలాగ్ అందరిని ఆలోచింపజేస్తాయి. ఇక ఎప్పటిలానే శర్వానంద్ యాక్టింగ్ తో మెప్పించారు. ఇతర నటీనటులు కూడా తమ తమ పాత్రలలో నటించి మెప్పించారు. వ్యవసాయం గురించి సరికొత్త యాంగిల్ లో చెప్పడానికి దర్శకుడు బాగానే ప్రయత్నం చేశాడని చెప్పవచ్చు.

కథ విషయానికి వస్తే సాయికుమార్ (ఏకాంబరం) అధిక డబ్బులు రైతులకు అధిక వడ్డీకి డబ్బులు ఇస్తూఉంటాడు. వారు వడ్డీలు కట్టలేక పోవడంతో వారి భూములను రాయించుకుంటాడు. ఈ క్రమంలోనే కేశవులు (రావు రమేష్) కూడా ఏకాంబరం
వద్ద బాకీ తీసుకోవడంతో, అతడి పొలాన్ని రాయాల్సిందిగా
ఏకాంబరం ఒత్తిడి చేస్తాడు.ఈ విషయం తెలుసుకున్న
కేశవులు కొడుకు కార్తీక్(శర్వానంద్) సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని విడిచిపెట్టి తన ఊరికి వస్తాడు. అక్కడ తన తండ్రి బాకీ తీర్చేందుకు కార్తీక్ వ్యవసాయం చేస్తాడు. ఈ క్రమంలో ఊళ్లో జనం అందరూ పట్నం బాటపడుతుండటంతో వారిని కార్తీక్ ఎలా ఆపాడు? అసలు కార్తీక్ పల్లెటూరికి రావడానికి అసలైన కారణం ఏమిటి అతడువ్యవసాయంలో ఎంతమేర రాణిస్తాడు?చివరికిఏకాంబరం ఏమవుతాడుఅనేది సినిమా కథ. ఈ సినిమా కథ చాలా రొటీన్ అయినప్పటికీ, రైతులు ఎదుర్కొంటున్నసమస్యలను,మనకు మరోసారి కళ్లకు కట్టినట్లు చూపెట్టారు. చిత్ర యూనిట్.

Advertisement

తాజా వార్తలు

Advertisement