Sunday, April 28, 2024

ఏజెంట్ సాయి శ్రీ‌నివాస‌ ఆత్రేయ‌కు సీక్వెల్ రెడీ.. న‌వీన్ పొలిశెట్టికి మ‌రో క్రేజీ ప్రాజెక్టు..

ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ బాక్సాఫీసు వద్ద సత్తా చాటింది. యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి కెరీర్ కు స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసింది ఈ ఫిల్మ్. అయితే ఈ సినిమా సీక్వెల్ గురించి చాలా కాలంగా వార్త‌లు వినిపిస్తున్నాయి. కాగా, తాజాగా మూవీ సీక్వెల్ పైన క్లారిటీనిచ్చారు ఆ సినిమా దర్శకులు. స్వరూప్ దర్వకత్వంలో తెరకెక్కిన ‘మిషన్ ఇంపాజిబుల్’ మూవీ ఇటీవల విడుదలైంది. ఈ చిత్ర ప్రమోషనల్ కార్యక్రమాల్లో ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్ర సీక్వెల్ పైన క్లారిటీ ఇచ్చారు డైరెక్ట‌ర్‌.

తన తొలి చిత్రం అయిన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సీక్వెల్ పక్కాగా ఉంటుంద‌ని చెప్పాడు డైరెక్ట‌ర్ స్వ‌రూప్‌. అయితే ప్ర‌స్తుతం స్క్రిప్ట్‌ను పూర్తి చేసే ప‌నిలో ఉన్నామ‌ని, త్వరలోనే సీక్వెల్ స్టార్ట్ అవుతుందని పేర్కొన్నాడు. ఇక నవీన్ పొలిశెట్టి ‘జాతిరత్నాలు’ సక్సెస్ ను బాగా ఎంజాయ్ చేశారు. ‘అనగనగా ఒక రాజు’ మూవీ షూటింగ్ లో బ‌జీగా ఉన్నాడు న‌వీన్.. ఇందులో నవీన్ కి జోడీగా టాలివుడ్ స్వీటీ అనుష్క నటిస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement