Tuesday, April 30, 2024

‘ఆర్ ఆర్ ఆర్’ నుండి మ‌రో గ్లింప్స్..ఎప్పుడో తెలుసా..

స్టార్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న భారీ పాన్ ఇండియా మూవీ ఆర్ ఆర్ ఆర్. ఈ చిత్రంలో ఇద్ద‌రు స్టార్ హీరోలు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్..మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ లు న‌టిస్తుండ‌టంతో భారీ అంచ‌నాలు ఉన్నాయి. వీరి క‌ల‌యిక అటు నంద‌మూరి ఫ్యాన్స్ కి..ఇటు మెగా ఫ్యాన్స్ కి సంతోషాన్ని క‌లిగిస్తోంది. కాగా ఆర్ ఆర్ ఆర్ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన టీజ‌ర్లు, పోస్ట‌ర్లు ఈ మూవీపై భారీ హైప్ ను పెంచేశాయి.ఇది ఇలా ఉండగా.. ఈ సినిమా నుంచి మరో బిగ్ అప్డేట్ వచ్చింది.

ఆర్ ఆర్ ఆర్ చిత్రం నుండి సెకండ్‌ గ్లింప్స్‌ విడుదల తేదీని ఖరారు చేసింది ఈ చిత్ర‌ బృందం. 45 సెకండ్ల పాటు ఉండే.. సెకండ్‌ గ్లింప్స్ ను నవంబర్‌ 1 వ తేదీన ఉదయం 11 గంటల సమయంలో విడుదల చేస్తామని ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు ఎన్టీఆర్‌ మరియు రాం చరణ్‌ కలిసి ఉన్న ఓ పోస్టర్‌ ను కూడా విడుదల చేసింది . అయితే.. ఈ 45 సెకండ్ల పాటు ఉండే గ్లింప్స్‌ లో ఇద్దరూ హీరోలు కనిపిస్తారా లేదా అనేది చూడాలి. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుల‌తో పాటు హాలీవుడ్ న‌టి కూడా న‌టిస్తుండ‌టం విశేషం. మ‌రి ఇప్పుడు రిలీజ్ చేయ‌నున్న గ్లింప్స్ ఎన్ని రికార్డులు సృష్టించ‌నుందో.

Advertisement

తాజా వార్తలు

Advertisement