Tuesday, July 23, 2024

Nani | ‘సరిపోదా శనివారం’ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్‌..

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ అప్‌కమింగ్ మూవీ ‘సరిపోదా శనివారం’. అంటే సుందరానికి తర్వాత ఈ సినిమాతో వీరి కాంబో మరోసారి రిపీట్ అవుతొంది. ఆగస్ట్ 29న ఈ సినిమా విడుదల కాబోతోంది.. ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ క్ర‌మంలో సినిమాలోని ఫ‌స్ట్ సింగిల్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ‘గరం.. గరం’ అనే ఫస్ట్ సింగిల్‌ను 15వ తేదీన (శనివారం) ఈ సాంగ్ రిలీజ్ విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.

మలయాళ సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. తెలుగులో టాక్సీ వాలా, చావు కబురు చల్లగా, పక్కా కమర్షియల్, ఓకే ఒక జీవితం చిత్రాలకు జేక్స్ ఇప్పటికే సంగీత దర్శకుడిగా పనిచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement