Thursday, April 18, 2024

శంక‌ర్, రామ్ చ‌ర‌ణ్ ల గేమ్ చేంజ‌ర్….

కథానాయకునిగా, శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి ‘ గేమ్‌ చేంజర్‌’ టైటిల్‌గా నిర్ణయించారు. భారీ వ్యయం తో దిల్‌ రాజు నిర్మిస్త్తున్న పాన్‌ ఇండియా చిత్రమిది. ఇది రామ్‌చరణ్‌ కు 15వ సినిమా.
సోమవారం రామ్‌ చరణ్‌ పుట్టినరోజు సందర్భగా గేమ్‌ చేంజర్‌ -టైటిల్‌ వెల్లడిస్తూ వీడియోను చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసింది. మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చణ్‌ పాన్‌ ఇండియా ఇమేజ్‌కు తగినట్టుగా -టైటిల్‌ను దర్శకుడు శంకర్‌ ఖరారు చేశారు. వీడియో చూస్తే హీరో క్యారెక్టరైజే షన్‌ ఎలా ఉంటుందనేది తెలుస్తోంది.


ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌, కియారా అద్వానీ, అంజలి, సముద్రఖని, ఎస్‌.జె.సూర్య, శ్రీకాంత్‌, సునీల్‌, నవీన్‌ చంద్ర తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి రచయితలు: ఎస్‌. యు.వెంకటేశన్‌, ఫర్హద్‌ సామ్‌జీ, వివేక్‌, స్టోరీ లైన్‌: కార్తీక్‌ సుబ్బరాజ్‌, సినిమాటోగ్రఫీ: ఎస్‌.తిరుణావు క్కరసు, సంగీతం : తమన్‌, సంభాషణలు: సాయిమాధవ్‌ బుర్ర.

Advertisement

తాజా వార్తలు

Advertisement