Wednesday, April 14, 2021

పుడింగి నెంబర్ 1గా బర్నింగ్ స్టార్..

సంపూర్ణేశ్ బాబు కథానాయకుడిగా మరో సినిమా తెరకెక్కనుంది. ఆ సినిమా పేరే పుడింగి నెంబర్1. తాజాగా సంపూ నటించిన మరో మూవీ రౌడీ బజార్ విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమా హైదరాబాద్ – రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలను జరుపుకుంది. కేఎస్ రామారావు క్లాప్ ఇవ్వగా .. భీమనేని శ్రీనివాసరావు కెమెరా స్విచ్చాన్ చేయగా ముహూర్తపు సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ సినిమాతో మీరావలి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. పలు చిత్రాలలో హాస్యనటిగా మెప్పించిన విద్యుల్లేఖ రామన్ ఈ సినిమాతో కథానాయిక అవుతోంది. మరో కథానాయికగా సాఫీ కౌర్ పరిచయమవుతోంది. పోసాని … అజయ్ ఘోష్ ముఖ్యమైన పాత్రలను పోషించనున్న ఈ సినిమా, ఈ రోజు నుంచే రెగ్యులర్ షూటింగు జరుపుకోనుంది. జూలైలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News