Saturday, May 4, 2024

స‌మ్మ‌ర్ కానుక‌గా.. సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌

డిఫ‌రెంట్ క‌థ‌ల‌ను ఎంచుకుంటూ త‌న‌దైనశైలిలో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో శ్రీవిష్ణు. కాగా ప్ర‌స్తుతం శ్రీ విష్ణు రామ్ అబ్బరాజు దర్శకత్వంలో సామజవరగమన అనే రొమ్‌-కామ్‌ ఎంటర్‌టైనర్‌ చేస్తున్నారు.ఈ సినిమాలో విష్ణుకు జోడీగా బిగిల్‌ ఫేమ్‌ రెబా మోనికా జాన్‌ నటిస్తుంది.ఈ సినిమాను హాస్య మూవీస్‌ బ్యానర్‌పై రాజేష్ దండ ఈ సినిమాను నిర్మించాడు. గోపి సుందర్‌ స్వరకల్పనలో రూపొందింది. ఇప్పటికే రిలీజైన టీజర్ సినిమాపై మంచి హైప్‌ క్రియేట్‌ చేసింది. కాగా తాజాగా మేకర్స్‌ ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను ప్రకటించింది. సినిమాలు లేకుండా సమ్మర్‌ పూర్తి కాదు. పైగా అందరికీ నచ్చే సీజన్‌ సమ్మర్‌. స్కూల్స్‌, కాలేజీలు గట్రా ఉండవు. కాబట్టి మే 18న అంటే మరో 30 రోజుల్లో సినిమా మీ ముందుకు వచ్చేస్తుంది అంటూ శ్రీవిష్ణు వీడియోలో వెల్లడించాడు. ఈ సినిమాను సమ్మర్‌ కానుకగా మే 18న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ఓ వీడియోను రిలీజ్‌ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement