Saturday, May 18, 2024

నీకిప్పుడే రాజకీయాలొద్దురా.. బాలుడికి లోకేష్ హితబోధ

కర్నూలు (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో) : కర్నూలు జిల్లాలో నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్రలో బుధవారం ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. ఆలూరు నియోజకవర్గం పుప్పలదొడ్డిలో చేపట్టిన యువగళం పాదయాత్రలో అందరితో పాటు పసుపురంగు టీషర్టు వేసుకున్న ఒక బాలుడు పాల్గొనడాన్ని లోకేష్ గమనించారు. ఉత్సాహంగా యాత్రలో పాల్గొంటున్న ఆ బాలుడ్ని లోకేష్ దగ్గరకు తీసుకొని అప్యాయంగా పలకరించి కుశలప్రశ్నలు వేశారు.

చదువుకునే చిన్న పిల్లలు ఇలా పార్టీ రాజకీయాల కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిది కాదని లోకేష్ భావించారు. ఆపై ఆ బాలుడితో “ఇప్పుడే రాజకీయాలు వద్దురా. ముందు మంచిగా, బాగా చదువుకో ” అని వాడు వేసుకున్న టీషర్టు తీయించి నచ్చజెప్పి పంపించేశారు. ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో లబ్ధిపొందేందుకు తహతహ లాడుతున్న ఈరోజుల్లో బాలుడి భవిష్యత్ కోసం లోకేష్ ఆలోచించడం అందరినీ ఆకట్టుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement