Thursday, May 2, 2024

సల్మాన్ ఖాన్ ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ ట్రైలర్ అప్డేట్.. డేట్ ఫిక్స్ చేసిన మేకర్స్

బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్ ఈ వేసవిలో ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ సినిమాతో అభిమానులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సినిమాలో టాలీవుడ్ ప్రముఖ నటులు వెంకటేష్, భూమిక ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీలో తెలంగాణ సాంప్రదాయ “బతుకమ్మ” పాట కూడా ఉంది. ఇటీవల విడుదలైన “ఏంటమ్మా…” పాటలో కూడా తెలుగు టచ్ ఉంది. అంతే కాకుండా.. ఈ సాంగ్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అతిధి పాత్రలో కనిపించారు. .

కాగా, మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో, ట్రైలర్ లాంచ్ డేట్ గురించి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. దానికి సంబంధించి ఓ కొత్త పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే కూడా తమ ట్విట్టర్ పేజీలలో ఈ కొత్త పోస్టర్‌ను షేర్ చేశారు. ఈ పోస్టర్‌లో సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే రొమాంటిక్ పోజ్‌లో అద్భుతంగా కనిపించారు. సల్మాన్ పొడవాటి బాబ్ హెయిర్‌స్టైల్‌తో మోడిష్ లుక్‌ని సొంతం చేసుకోగా, పూజ స్టైలిష్ అప్పీల్‌ని సొంతం చేసుకుంది! కాగా, ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ యాక్షన్ ఎంటర్‌టైనర్ కి సంబంధించిన ట్రైలర్ ఈ నెల (ఏప్రిల్) 10న రిలీజ్ కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement