Thursday, May 2, 2024

స‌లార్ లేటెస్ట్ అప్‌డేట్… లాస్ట్ స్టేజ్ కి చేరుకున్న షూటింగ్

మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న‌బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ “సలార్”. ఈ మూవీలో శృతి హాస‌న్ హీరోయిన్ గా క‌నిపించ‌నుంది. కేజిఎఫ్- 1, 2 సినిమాల త‌రువాత నీల్ తెర‌కెక్కిస్తున్న సినిమా కావ‌డం.. ఈ సినిమాలో ప్ర‌భాస్ హీరోగా న‌టిస్తుండ‌టంతో ఈ మూవీ భారీ అంచ‌నాలే ఎర్పడ్డాయి. కాగా, లేటెస్ట్ అప్డేట్ ప్ర‌కారం.. ఈ సినిమాని షూటింగ్ ని శ‌ర‌వేగంగా పూర్తి చేస్తున్నాడు నీల్.. ప్రస్తుతం సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్ లోకి వచ్చిన‌ట్టు తెలుస్తోంది.

మేకర్స్ లాస్ట్ షెడ్యూల్ ని స్టార్ట్ చేసినట్టు సినీ వ‌ర్గాలా స‌మాచారం.. ఇక‌ ఈ షూట్ కేవలం కొన్ని రోజులు వ్యవధి మాత్రమే ఉండ‌నుందని తెలుస్తోంది. కాగా, ఈ షెడ్యూల్ పూర్తైతే సలార్ మూవీకి గుమ్మడికాయ కొట్టేస్తారనే చెప్పాలి. ఇక ఈ సినిమాని హోంబళే ఫిల్మ్స్ వారు భారీ ఎత్తున నిర్మిస్తుండ‌గా.. సినిమాకి కేజిఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. అలాగే ఈ మూవీ ఏడాది సెప్టెంబర్ 28న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement