Tuesday, April 30, 2024

Salaar | ఏప్రిల్ లో సెట్స్ మీదకి సలార్ 2

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘‘సాలార్’’. ఈ సినిమా థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను, అభిమానులను ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టిన ఈ సినిమా పార్ట్ 2 కోసం ప్రేక్షకులు, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన బాబీ సింహా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఏప్రిల్ సాలార్ 2 సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలిపారు. ఇందుకోసం మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు అని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement