Tuesday, October 8, 2024

AP – రాసి పెట్టుకోండి – జగన్ ఓటమి ఖాయం – ప్రశాంత్ కిషోర్

హైదరాబాద్ – త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై ప్రముఖ రాజకీయ వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు.

హైదరాబాద్ లో నేడు జరిగిన ఓ ఈవెంట్ లో పాల్గొన్న ఆయన.. ఏపీ ప్రజలు ఉచిత పథకాల కంటే అభివృద్ధికి పట్టం కడతారని జోస్యం చెప్పారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు ని, జగన్ ఫాలో అవుతున్నారని.. తెలంగాణలో కేసీఆర్ కి ఎదురైన పరాభవమే ఆంధ్రలో జగన్ కూడా ఎదుర్కొంటారన్నారు.

ఉచిత పథకాల ద్వారా ప్రజలకు డబ్బు పంచి ఎన్నికల్లో గెలుస్తామనుకోవడం మూర్ఖత్వం అంటూ కౌంటర్ విసిరారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారీ విజయం సాధించే అవకాశాలున్నాయన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement