Thursday, May 2, 2024

Latest | సైంధవ్ అప్‌డేట్.. హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్‌తో క్లైమాక్స్

హిట్ సిరీస్ తో త‌న‌కంటూ ఓ బేస్ క్రియూట్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ డైరెక్ట‌ర్ శైలేష్ కొలను దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న మూవీ ‘సైంధవ్’. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతొన్న ఈ మూవీని వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. కాగా, ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ పార్ట్ పూర్తయిందని మేకర్స్ ప్రకటించారు. షూటింగ్ విజయవంతంగా పూర్తయిందని వీడియో విడుదల చేశారు. ఈ షూటింగ్‌లో 8 మంది నటీనటులు, రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్ పాల్గొన్నారని పేర్కొన్నారు.

సైంధవ్ మూవీలోని కీలకమైన క్లైమాక్స్ షెడ్యూల్‌ను పూర్తి చేసినట్లు దర్శకుడు వెల్లడించారు. హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషన్స్ ప్యాక్డ్ క్లైమాక్స్ ఎపిసోడ్ ఈ సినిమాలో ఉంటుందని సమాచారం. ఈ అప్‌డేట్‌తో వెంక‌టేష్ అభిమానులు హైప్ పెరిగింద‌నే చెప్పాలి.

బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ హై-ఆక్టేన్ యాక్షన్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. శ్రద్ధా శ్రీనాథ్, రుహాని శర్మ, ఆండ్రియా జెర్మియా కథానాయికలు. సంతోష్ నారాయణన్ సంగీతం సమకూరుస్తున్నారు. డిసెంబర్ 22న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమా విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement