Thursday, May 2, 2024

అక్క టైం బాగుంది..!! ఇప్పుడు చెల్లెలు వంతు

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది సాయిపల్లవి. ఈ సినిమాలో సాయి పల్లవి నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఒక్క తెలుగులోనే కాకుండా సౌత్ లో ప్రస్తుతం సాయిపల్లవి స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఇక అసలు విషయానికొస్తే సాయి పల్లవికి ఓ చెల్లెలు ఉంది. ఆమె పేరు పూజా కన్నన్. ఇక సాయి పల్లవికి పూజా కన్నన్ అంటే ఎంతో ఇష్టమట. కాగా తన చెల్లెలు సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ కోసం సాయిపల్లవి తెగ ప్రయత్నాలు చేస్తోందని సమాచారం.

అయితే స్టంట్ కొరియోగ్రాఫర్ సెల్వ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్న సినిమాలో పూజా కన్నన్ ను హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఆ సినిమాలో సముద్రకని, సెల్వ కీలక పాత్రలు పోషించనున్నారు. ఈ సినిమా త్వరలో పట్టాలెక్కింది. విశేషమేంటంటే సాయి పల్లవిల పూజా కన్నన్ కూడా మంచి డాన్సర్. ఏ. ఎల్ విజయ్ కు అసిస్టెంట్ గా పని చేసిన పూజా కన్నన్ ఇప్పుడు ఆయన కథ తోనే ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది. మరి పూజా కన్నన్ ఏ మేరకు ఆకట్టుకుంటుందో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement