Sunday, April 28, 2024

Sai Pallavi : సాయి ప‌ల్ల‌వి రేంజ్ వేర‌బ్బా…

సౌత్ ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి.. ప్రస్తుతం తండేల్ మూవీతోపాటు అమరన్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ నటుడు శివకార్తికేయన్ కు జోడీగా అమరన్ లో నటిస్తోంది సాయి పల్లవి. విలక్షణ నటుడు కమల్ హాసన్ కు చెందిన రాజ్‌ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ తోపాటు సోనీ పిక్చర్స్ ఈ సినిమను తెరకెక్కిస్తోంది. హీరో శివ కార్తికేయన్ బర్త్ డే సందర్భంగా మేకర్స్.. ఇటీవల అమరన్ టీజర్ ను విడుదల చేశారు.

అయితే అమరన్ మూవీలో సాయి పల్లవి రోల్ ఛాలెంజింగ్ గా ఉంటుందని డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియస్వామి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. సాయి పల్లవి, శివకార్తికేయన్‌ ల మధ్య కొన్ని కీలకమైన సీన్స్ ను చిత్రీకరించాల్సి ఉందని చెప్పారు. అమరన్ లోని హై పేస్ డ్యాన్స్ సీక్వెన్స్ చూడనున్నారని పేర్కొన్నారు. మూవీ అవుట్ పుట్ తో కమల్ హాసన్ చాలా హ్యాపీగా ఉన్నట్లు చెప్పారు. ఇండియన్ మిల‌ట‌రీ మేజర్ ముకుంద్ వరదరాజన్ నిజ జీవిత‌ ఆధారంగా రాహుల్ సింగ్, శివ్ అరూర్ ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్ పేరుతో పుస్త‌కాన్ని రాశారు. ఆ బుక్ ఆధారంగా అమరన్ సినిమాను మేకర్స్ తెర‌కెక్కించారు. స్టోరీ, స్క్రీన్‌ప్లే పై చాలాకాలం క‌ష్ట‌ప‌డి రీస‌ర్చ్ చేశారు రాజ్‌కుమార్ పెరియసామి. ఈ ఏడాదిలోనే అమరన్ మూవీ రిలీజ్ కానుంది. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement