Friday, April 26, 2024

మరోసారి రచ్చ లేపనున్న ఆర్ఆర్ఆర్.. రీ-రిలీజ్ కి రెడీ అయిన విజువల్ వండర్

రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన RRR. ఈ మల్టీస్టారర్ టాలీవుడ్‌లోని అన్నీ రికార్డును బద్దలు కొట్టి కొత్త ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అంతే కాకుండా ఈ మూవీ అంతర్జాతీయ స్థాయిలో బ్యాక్ టు బ్యాక్ అవార్డులను గెలుచుకుటూ.. ఆస్కార్ అవార్డులకు సైతం ఎంపికైంది.

ఇక ప్రస్తుతం లేటెస్ట్ అప్‌డేట్ ఏమిటంటే, ఈ ఇంటెన్స్ యాక్షన్ సాగా ఈ నెల (మార్చి) 10న ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రీ-రిలీజ్ కానుంది. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ మూవీ రెండవ సారి ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.

- Advertisement -

ఈ బిగ్-బడ్జెట్ విజువల్ వండర్ మూవీ గత ఏడాది (2022) మార్చి 25న థియేటర్లలో రిలీజ్ అయింది. అలియా భట్, అజయ్ దేవగన్, శ్రియా శరణ్, ఒలివియా మోరిస్, రే స్టీవెన్‌సన్, అలిసన్ డాడీ, సముద్రఖని, రాహుల్ రామకృష్ణ ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. డివివి దానయ్య నిర్మించిన ఈ మూవీ ఎంఎం కీరవాణి స్వరాలు సమకుర్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement