Monday, April 29, 2024

Rayalaseema Feast – టిటిపి నేత ఇంటిలో అల్లు అర్జున్ కు రాయ‌ల‌సీమ విందు …

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు రాయలసీమకు చెందిన నేత విందు ఇచ్చారు. అల్లు అర్జున్ తన స్నేహితులతో కలిసి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు నిన్న కారులో వెళ్తూ . గార్లదిన్నె మండలం కనుంపల్లి వద్ద ఉన్న టిడిపి నేత కేశవరెడ్డి ఫామ్ హౌస్ కు వచ్చారు. ఈ సందర్భంగా బన్నీకి కేశవరెడ్డి, ఆయన కుమారుడు రాహుల్ రెడ్డి స్వాగతం పలికారు. రాయలసీమ రుచులతో విందు భోజనం పెట్టారు. అల్లు అర్జున్ వచ్చాడనే విషయం తెలియగానే ఫామ్ హౌస్ కు జనాలు పోటెత్తారు. అభిమానులతో ఫామ్ హౌస్ కిటకిటలాడింది. ఫ్యాన్స్ కు బన్నీ అభివాదం చేశారు. బన్నీతో ఫొటోలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఆ తర్వాత అల్లు అర్జున్ బెంగళూరుకు బయల్దేరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement