Sunday, April 21, 2024

రావ‌ణాసుర చిత్రం నుండి ర‌వితేజ పోస్ట‌ర్

హీరో ర‌వితేజ మాంచి జోరుమీదున్నారు. ఆయ‌న ప‌లు చిత్రాల్లో న‌టిస్తుండ‌గా తాజా చిత్రం రావ‌ణాసుర నుండి పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని సుధీర్ వ‌ర్మ తెర‌కెక్కించారు. ఈ సినిమాకి పూజా కార్య‌క్ర‌మాల‌ను నేడు హైద‌రాబాద్ లో నిర్వ‌హించారు. ఈ చిత్రంలో రవితేజ లాయర్ పాత్రలో కనిపిస్తున్నారు. అదే విధంగా ఈ సినిమాలో సుషాంత్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక నేడు జరిగిన పూజా కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుండి ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో రవితేజ మాస్ లుక్ లో ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమాను సెప్టెంబర్ 30వ తేదీన విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement