Saturday, May 11, 2024

హైదరాబాద్ లో ‘రావణాసుర’

వేగంగా సినిమాలు పూర్తిచేసే హీరోల్లో రవితేజ ఒకరు. ఏడాదిలో కనీసం రెండు సినిమాల్లో నటిస్తుంటారు. ఆయన వేగానికి తగినట్టుగానే దర్శకులు వ్యవహరిస్తుంటారు. గత ఏడాది క్రాక్‌ సినిమాతో సూపర్‌హిట్‌ అందుకున్న రవితేజ టాలీవుడ్‌ బిజీ హీరోల్లో ఒకరు. కొత్త సినిమాలు వరుసగా అంగీకరిస్తున్నారు. వాటిలో రావణాసుర కూడా ఒక‌టి. ఇటీవలే చిత్రీకరణ ప్రారంభించారు. ప్రస్తుతం కరోనా ప్రభావం తీవ్రంగా ఉంది. అయినప్పటికీ రావణాసుర సినిమాను తగిన జాగ్రత్తలతో పూర్తిచేయడానికి రవితేజ సిద్దమయ్యారు.

ముఖ్యంగా హైదరాబాద్‌లో వివిధ లొకేషన్స్‌లో అంటే ఔట్‌డోర్‌లో షూటింగ్‌ చేసేందుకు పచ్చజండా ఊపారని ప్రచారం జరుగుతోంది. ఎలాంటి సెట్స్‌ వేయకుండా సహజసిద్దమైన లొకేషన్స్‌లో షూటింగ్‌ చేస్తూ, త్వరితగతిన సినిమా పూర్తిచేస్తారట. తగిన ప్లానింగ్‌ ప్రకారం పూర్తిచేసేందుకు దర్శకుడు సుధీర్‌ వర్మ ప్లాన్‌ చేసినట్టు తెలిసింది. ఈ సినిమాలో రవితేజ న్యాయవాదిగా కనిపిస్తారు. సుశాంత్‌ మరో కీలక పాత్రధారి. అను ఇమ్మాన్యుయేల్‌, మేఘా ఆకాష్‌, ఫరియా అబ్దల్లా, పూజిత పొన్నాడ, దక్షా తదితరులు నటిస్తున్నట్టు సమాచారం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement