Friday, April 26, 2024

రిలీజ్ అయిన రావణాసుర అంథెమ్..

డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘రావణాసుర’. ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, పూజిత పొన్నాడ, దక్షా నగర్కర్, ఫరియా అబ్దుల్లా కథానాయికలుగా నటిస్తున్నారు. కాగా, ఇవ్వాల (ఆదివారం) సాయంత్రం రావణ అంథెమ్ రిలీజ్ చేయబోతున్నట్లు ముందుగానే ప్రకటించారు మేకర్స్. ఇక కొద్ది నిమిషాల క్రితమే రావణ అంథెమ్ రిలీజ్ అయింది.

హర్షవర్ధ రామేశ్వర్ కంపోజ్ చేసిన ఈ ట్రాక్‌ని హారిక నారాయణ్, హర్షవర్ధన్, నోవ్లిక్ మరియు శాంతి పీపుల్ పాడారు. పాట చాలా ఎనర్జిటిక్ గా, పవర్ ఫుల్ గా ఉంది. అభిషేక్ పిక్చర్స్, RT టీమ్‌వర్క్స్ నిర్మించిన రావణాసుర మూవీలో రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా, ఇతరులు ప్రముఖ పాత్రల్లో నటించారు. ఈ పాన్ ఇండియా మూవీ ఏప్రిల్ 7, 2023న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధంగా ఉంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement