Wednesday, May 1, 2024

బూరెల బుట్టలో పడ్డ రాశిఖన్నా!!

ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన బ్యూటి రాశికన్నా. ప్రారంభంలో కాస్త నెమ్మదిగా సినిమాలు చేసినప్పటికీ… ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ మంచి జోష్ మీద ఉంది. ఒక్క తెలుగులోనే కాకుండా తమిళనాట,కోలీవుడ్ నాట కూడా సినిమాలు చేస్తోంది. తాజాగా తెలుగులో మరో సినిమాకి రాశి కన్నా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

మారుతి దర్శకత్వంలో గోపిచంద్ హీరోగా తెరకెక్కుతున్న పక్కా కమర్షియల్ సినిమాలో రాసి కన్నా నటించేందుకు ఓకే చెప్పిందట. ఈ సినిమా తర్వాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో కూడా ఓ సినిమాకు ఓకే చేసిందట. అదే థాంక్యూ సినిమా. దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో కథానాయికగా రాశికన్నాను తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ పేరును త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement