Wednesday, April 24, 2024

గోదావరి పెర్రీ పాయింట్ లో ఘోరం – మూగజీవాలను తాళ్లతో కట్టి లాకెళ్తున్న వైనం…

చర్ల, : మండలం లోని పెద్ది‌పల్లి గోదావరి పెర్రీ పాయింట్ లో నిర్వాహకుల పైశాచికత్వానికి అంతే లేదు. మూగజీవాలను పడవకు కట్టి లాక్కెళ్లే సంఘటన చూసే చూపరులకు కంట తడి పెట్టిస్తుంది. వివరాల్లోకి వెళితే పెద్దిపల్లి గోదావరి పెర్రి పాయింట్ లో శనివారం ఉదయం పక్కా సమాచారంతో వెళ్లిన విలేఖరుల బృందం ఆ సంఘటన చూసి షాక్ కు గురై చలించిపోయారు.మార్చి 30వ తారీఖున జరిగిన వేలం పాటలో గోదావరి పెర్రీ పాయింట్ దక్కించుకున్న నిర్వాహకులు కాక గిరిజనేతర వ్యక్తి పడవ ద్వారా మనుషులను దాటిస్తూ నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ చార్జీ వసూలు చేస్తున్నట్టు పలువురు ఆరోపిస్తున్నారు. ఇది కాక అక్రమంగా పశువులను పడవకు ఇరువైపులా తాళ్లతో మెడకు కట్టి సుమారు నలభై పశువులను పడవలో మోటార్ స్టార్ట్ చేసి తీసుకు వెళ్తున్న వైనం చూపరులను కంటతడి పెట్టిస్తుంది. ఇదేమని అడిగినవిలేఖర్లబృందానికి గిరిజనేతర(నిర్వాహకులు ) వ్యక్తి తాము ఏమి చేసినా అడిగేవారు లేరంటూ, మీరు ఏం రాసుకుంటారో రాసుకోండి అంటూ సమాధానం ఇవ్వడంతో విలేఖరులు ఖంగుతినడం జరిగింది. ఇలా ప్రతిరోజు వందలాదిగా మూగజీవాలను పడవకు కట్టిపడేసి తీసుకు వెళ్తున్నట్టు పలువురు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మూగజీవాలను హింసిస్తున్న ఇటువంటి వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement