Monday, May 6, 2024

రామ్ లింగుస్వామి సినిమా స్టార్ట్…అఫీషియల్

ఇస్మార్ట్ శంకర్ సినిమా తో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. అదే జోష్ తో రెడ్ సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా పర్వాలేదనిపించింది. అయితే ప్రస్తుతం రామ్ తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

ఇక హీరోయిన్ గా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటిస్తోంది. అయితే ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా తెలుగు తమిళ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. కాగా తాజాగా ఈ సినిమా నుంచి ఓ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైందని అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ సినిమాతో రామ్ కోలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement