Sunday, October 6, 2024

శంకర్ కు స్పెషల్ విషెస్ చెప్పిన రామ్ చరణ్

సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. ఇక ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ రెట్టింపు అవుతున్నాయి. ఇక ఈ సినిమాకు ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తుండగా… ప్రముఖ రచయిత సాయిమాధవ్ బుర్రా మాటలు రాస్తున్నారు.

ఇదిలా ఉండగా డైరెక్టర్ శంకర్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా స్పెషల్ విషెస్ తెలియజేశారు రామ్ చరణ్. శంకర్ సార్ కి జన్మదిన శుభాకాంక్షలు… మన సినిమా సెట్ లో మీట్ అవుదాం.. ఈ ఏడాది మీకు మరింత గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ తెలిపారు రామ్ చరణ్.

Advertisement

తాజా వార్తలు

Advertisement