Monday, April 15, 2024

రామ్ చరణ్ న్యూ లుక్… శంకర్ ప్లానింగ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు చరణ్. ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా చేశారు చిత్రయూనిట్. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా సినిమాపై అంచనాలు ఎక్కువవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం రామ్ చరణ్ మాసివ్ లుక్ కు సంబంధించిన టెస్ట్ ను చేసేందుకు శంకర్ ప్లాన్ చేస్తున్నాడట.

ఇప్పటికే అందుకు సంబంధించిన కాస్ట్యూమ్స్ అన్ని కూడా సిద్దం చేస్తున్నాడట. త్వరలోనే రాంచరణ్ కూడా లుక్ టెస్ట్ లు హాజరు కాబోతున్నారట. ఇక ఈ సినిమాకు ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తుండగా…సాయి మాధవ్ బుర్రా మాటలు రాస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement