Monday, April 29, 2024

రజనీకాంత్ ‘జైలర్’ ఆడియో లాంచ్ డేట్ లాక్..

సూపర్ స్టార్ రజనీకాంత్ త‌న అప్ క‌మింగ్ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్ “జైలర్”లో కనిపించనున్నారు. నెల్సన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్, తమన్నా భాటియా, రమ్యకృష్ణ, మర్నా మీనన్ మరియు నాగబాబు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా, మూవీ నుండి రిలీజ్ అయిన‌ మొదటి రెండు సింగిల్స్, ‘కావాలా’, ‘హుకుమ్’ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన మ‌రో బిగ్ అప్‌డేట్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. మూవీ ఆడియో లాంచ్ జూలై 28న చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో గ్రాండ్‌గా జరగనుందని వెల్ల‌డించారు మేక‌ర్స్. ఈ ఈవెంట్ లో మిగిలిన పాటలతో పాటు థియేట్రికల్ ట్రైలర్‌ను ఆవిష్కరించనున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు రిలీజ్ అయిన పాట‌ల‌కు సూప‌ర్ హైప్ క్రియేట్ కావ‌డంతో మిగిలిన పాటలు, థియేట్రికల్ ట్రైలర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స‌న్ పిక్చర్స్ బ్యానర్‌తో రూపొందిన ఈ బిగ్గీకి అనిరుధ్ రావిచంద‌ర్ సంగీత అందించాడు. కాగా ఈ మూవీ వ‌చ్చే నెల (ఆగస్టు) 10న గ్రాండ్‌గా రిలీజ్ కి రెడీ గా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement