Friday, April 26, 2024

pspk 28: మళ్లీ ఫుల్లీ లోడింగ్..

దర్శకుడు హరీశ్‌ శంకర్‌, నటుడు పవన్‌ కల్యాణ్‌.. వచ్చిన ‘గబ్బర్‌సింగ్‌’ ఎంతటి హిట్ అయిందో అందరికి తెలిసిందే. అప్పట్లో గబ్బర్ సింగ్ సినిమా మాస్ ప్రేక్షకులను ఊర్రూతలూగించింది. అదే ఉత్సాహంతో త్వరలోనే మరో సినిమాతో వినోదం పంచనున్నారు. ‘PSPK 28’ వర్కింగ్‌ టైటిల్‌తో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. . నేడు పవన్‌ కల్యాణ్‌ పుట్టిన రోజుని పురస్కరించుకుని జాతర  షురూ అంటూ చిత్రబృందం ప్రీ లుక్‌ను విడుదల చేసింది. బైక్‌ మీద గన్‌ పట్టుకుని స్టైలిష్‌గా కూర్చున్న పవన్‌ లుక్‌ అదిరిపోయింది. నెట్టింట ఈ లుక్‌ వైరల్‌ అవుతోంది. ప్రస్తుతం పవన్‌ చేస్తున్న చిత్రాలు పూర్తయ్యాక హరీశ్‌ శంకర్‌ ఈ చిత్రాన్ని సెట్స్‌ మీదకు తీసుకెళ్లనున్నారు. నాయిక, టైటిల్‌ వివరాల్ని మరికొన్ని రోజుల్లో ప్రకటించనున్నారు. ప్రస్తుతం ‘భీమ్లా నాయక్‌’, ‘హరిహర వీరమల్లు’ చిత్రాలతో పవన్‌ కల్యాణ్‌ బిజీగా ఉన్నారు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం ప్రకటించారు.  పవన్ బర్త్ డే సందర్భంగా ఏం చేస్తారా అనే ఆలోచనలో ఉన్న అభిమానులకు ఆ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తూ పోస్టర్ ట్వీట్ చేశాడు దర్శకుడు హరీష్ శంకర్.

https://twitter.com/harish2you/status/1433378004592312321
Advertisement

తాజా వార్తలు

Advertisement