Friday, April 26, 2024

ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా పై అప్డేట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. కాగా ఆ తరువాత ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్ రాలేదు. ఈ నేపథ్యంలోనే ఫ్యాన్స్ అంతా కూడా ఈ సినిమా లేనట్టేనని భావించారు.

మరోవైపు ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ తరువాత ప్రశాంత్ నీల్ తో సినిమా చేయబోతున్నాడు అంటూ కూడా వార్తలు వచ్చాయి. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా ఆగిపోయిందంటూ వస్తున్న వార్తలకు నిర్మాత నాగ వంశీ పుల్ స్టాప్ పెట్టారు. ఇది చాలా మంచి జోక్ గైస్ అంటూ ఆయన ఓ ట్వీట్ చేశారు. దీంతో సినిమా ఆగిపోయిందన్న వార్తలు పటాపంచలైపోయాయి.

కాగా ఈ సినిమాకు అయినను పోయిరావలె హస్తినకు అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన అరవింద సమేత సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితులు మెరుగు పడిన తరువాత ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభిస్తారని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement