Friday, April 26, 2024

ప్రభాస్ కెరీర్ బెస్ట్ లవ్ స్టొరీ ‘రాధే శ్యామ్’

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పిరియాడిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రం పై చాలా అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త తాజాగా బయటకు వచ్చింది.

దశాబ్దకాలం తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న ఈ లవ్ స్టోరీ ప్రభాస్ కెరీర్ లోనే బెస్ట్ లవ్ అండ్ రొమాంటిక్ సినిమాగా నిలుస్తుందని తెలుస్తోంది. అలాగే లవర్ బాయ్ గా ప్రభాస్ చెరగని ముద్ర వేస్తారని కూడా టాక్ వినిపిస్తోంది. మరి ఈ సినిమా నిజంగా అభిమానులను ఆ స్థాయిలో ఆకట్టుకుంటుందో లేదో తెలియాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement