Friday, April 19, 2024

జర్నలిస్ట్ గా అవికా గోర్

ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మామ, ఎక్కడికి పోతావు చిన్నవాడా వంటి సినిమాలతో సూపర్ డూపర్ హిట్ ను అందుకుంది హీరోయిన్ అవికా గోర్. అయితే ఈ సినిమా తర్వాత అవికాగోర్ కు పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో బాగా సన్నబడింది. ఇక ప్రస్తుతం బల్‌వీర్‌ దర్శకుడిగా పరిచయం కాబోతున్న అమరన్‌ ఇన్‌ ది సిటీ చాప్టర్‌1 హీరోయిన్ గా నటిస్తోంది.

ఆది సాయి కుమార్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సజ్జా వెంకటేశ్వర రావు నిర్మిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో అవికాగోర్ ఓ జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుందట. ఓ కేసుని జర్నలిస్ట్ స్టూడెంట్ గా సోదిస్తున్న సమయంలో ఆమెకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనేది ఈ సినిమా కథాంశం గా తెలుస్తోంది. మరోవైపు ఎప్పటినుంచో ఆది సాయికుమార్ కూడా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. మరి ఈ ఇద్దరికీ ఈ సినిమా మంచి బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement