Thursday, May 2, 2024

ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారిగా….PSPK

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రేజీ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు. అలాగే సాగర్ కే చంద్ర దర్శకత్వంలో అయ్యప్పనుమ్ కొషియమ్ రీమేక్ లో నటిస్తున్నాడు. అలాగే గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ ని రిలీజ్ చేసి అంచనాలను కూడా పెంచాడు.

pspk28 అనే టైటిల్ తో ట్రెండింగ్ లో ఉన్న ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ సినిమాలో పవన్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడట. అందులో ఒకటి లెక్చలర్ పాత్ర కాదు ఇంకొకటి ఇంటిలిజెంట్ బ్యూరో అధికారిగా కనిపించబోతున్నాడట. ఇప్పటికే ఈ చిత్రంలోని అనేక కీలకమైన భాగాలను చిత్రీకరించడానికి ఓ సెట్ ను కూడా ఏర్పాటు చేస్తున్నారట. మరోవైపు ఈ సినిమాకు సంచారి అనే టైటిల్ ను పెట్టేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట.

Advertisement

తాజా వార్తలు

Advertisement