Tuesday, May 7, 2024

తోలు తీస్తా నా కొడ‌కా.. భీమ్లా నాయ‌క్ ట్రైలర్ అదుర్స్‌..

పవన్‌ కళ్యాణ్‌ తన అభిమానులకు అసలైన ట్రీట్‌ రెడీ అయ్యింది. భీమ్లా నాయ‌క్ సినిమా ట్రైలర్‌ ఎప్పుడు రాబోతుందని అంతా వెయిట్‌ చేస్తున్న తరుణంలో రెండు, మూడు రోజుల నుంచి నేడో, రేపో అంటూ సమచారం అందుతూ వచ్చింది. దీంతో ఫ్యాన్స్ కు భీమ్లా నాయక్ ట్రైలర్ పై ఇంకా ఆసక్తి పెరిగింది.

త్వ‌ర‌లో విడుద‌ల కాబోతున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్టుల్లో భీమ్లా నాయక్ ఒక‌టి. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ లీడ్‌ రోల్ పోషిస్తున్న ఈ సినిమా నుంచి క్రేజీ అప్ డేట్ రానే వ‌చ్చింది. భీమ్లా నాయ‌క్ ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ లాంఛ్ చేశారు. మ‌ల‌యాళ సూప‌ర్ హిట్ రీమేక్ అయ్య‌ప్ప‌నుమ్ కొషియుమ్ కు రీమేక్‌గా వ‌స్తున్న ఈ చిత్రంలో డానియ‌ల్ శేఖ‌ర్ పాత్ర‌లో రానా న‌టిస్తుండ‌గా.. కోలీవుడ్ భామ నిత్య మీన‌న్‌, మాలీవుడ్ భామ సంయుక్తా మీన‌న్ లు ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ఇప్పటికే అనేక సందిగ్ధాల మధ్య భీమ్లా నాయ‌క్ రిలీజ్‌ డేట్‌ ఎప్పుడు అనే సస్పెన్స్ నెలకొన్న నేపథ్యంలో రిలీజ్‌ డేట్‌ని కన్ఫమ్‌ చేశారు. ముందుగా చెప్పినట్టుగానే ఫిబ్రవరి 25నే భీమ్లానాయక్‌ సినిమాని విడుదల చేయబోతున్నట్టు వెల్లడించారు. అయితే ఫిబ్రవరి 25నే వస్తుందని అభిమానులు కూడా ఊహించలేదు. కానీ సడెన్‌గా రిలీజ్‌ డేట్‌ని ఖరారు చేయడంతో హంగామాకి పవన్‌ అభిమానులు సిద్ధమవుతుంది.

కాగా, ఇప్పుడు ఈ సినిమా నుండి ప‌వ‌ర్ ప్యాక్డ్ ట్రైల‌ర్ ని రిలీజ్ చేశారు.. సినిమా బృందం.. రాణా బెదిరింపులు ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌వ‌ర్ ఫుల్ డైలాగ్స్ నిత్యా మీన‌న్ ఎమోష‌నల్ సీన్స్ తో ఎంతో ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంది. దీంతో ఈ సినిమాపై ఇంకిన్ని అంచ‌నాలు పెంచే విదంగా ట్రైల‌ర్ ఉందంటున్నారు అభిమానులు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement