Sunday, April 21, 2024

వకీల్ సాబ్ కు పోలీస్ చెక్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం వకీల్ సాబ్. బాలీవుడ్ లో అమితాబ్ నటించిన పింక్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అయితే ఏప్రిల్ 9న ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కాబోతుంది. ఇదిలా ఉండగా ఈనెల 29న సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

థియేటర్స్ లో ఈ ట్రైలర్ రిలీజ్ కావడంతో అభిమానులు వేలల్లో పోటెత్తారు. గాయాలు అవుతున్న లెక్కచేయకుండా ట్రైలర్ చూసేందుకు నడుంబిగించారు. కాగా ఇప్పుడు ప్రమోషన్ లో భాగంగా ఏప్రిల్ 4న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేశారు చిత్ర యూనిట్. కానీ పోలీసులు అందుకు అనుమతి నిరాకరించారు. కరోనా ఆంక్షల నేపథ్యంలో అనుమతి ఇవ్వలేమని మరోవైపు బహిరంగ సభలో అభిమానులను కూడా కంట్రోల్ చేయలేమని పోలీసులు తేల్చి చెప్పేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement