Friday, April 26, 2024

పవన్ ముందే షూటింగ్ ఆపేసాడట !!

ఇటీవల వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వీటితో హరిహర వీరమల్లు, అయ్యప్పనుమ్ కొషియమ్ రీమేక్ చిత్రాలలో నటిస్తున్నాడు. అయితే ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ కు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన సినిమాలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.

నిజానికి వారం క్రితమే ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందట. ఈ విషయాన్ని బయటకు తెలపలేదు. పవన్ కు కరోనా లక్షణాలు కనిపించగానే షూటింగ్ ను ఆపేశాడట.కాగా పవన్ పూర్తిగా కోలుకున్న తర్వాత షూటింగ్ ప్రారంభించనున్నారు. ఇక వీటితో పాటు పవన్ లిస్టులో హరీష్ శంకర్, అలాగే సురేందర్ రెడ్డి కూడా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement