Friday, April 26, 2024

వకీల్ సాబ్ నే ఫాలో అవుతున్న క్రిష్ ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు అంతా కూడా ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే జాక్వలిన్ ఫెర్నాండెజ్ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. అయితే తాజా సమాచారం ప్రకారం….పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ లో ఎలా అయితే మూడు డిఫరెంట్ షేడ్స్ లో చూపించారో… హరిహర వీరమల్లు సినిమాలో కూడా అలానే మూడు డిఫరెంట్ లుక్స్ లో పవన్ కళ్యాణ్ కనిపించనున్నారని తెలుస్తోంది.

కాగా ఇప్పటికే ఈ సినిమాలో పవన్ డ్రెస్సింగ్ 30 రకాలుగా ఉంటుందని సమాచారం. మరి వాటికి అనుగుణంగా పవన్ లుక్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమాతో పాటు పవన్ అయ్యప్పనుమ్ కొషియమ్ రీమేక్ లో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement