Sunday, May 5, 2024

లుంగీలో రెచ్చిపోయిన భీమ్లా నాయక్..

పవన్ కళ్యాణ్ కొత్తి సినిమా టైటిల్ ఖారరయింది. ప‌వ‌న్ క‌ల్యాణ్, రానా ద‌గ్గుబాటి కాంబినేష‌న్ లో రూపుదిద్దుకుంటోన్న‌ అయ్య‌ప్ప‌నుమ్ కొషియుమ్ రీమేక్ సినిమా నుంచి ప‌వ‌న్ ఫ‌స్ట్ గ్లింప్స్ విడుద‌లైంది. ఈ సినిమాకు ‘భీమ్లా నాయక్‌’ టైటిల్ ఖ‌రారు చేశారు. స్వాతంత్ర్య‌ దినోత్స‌వం సంద‌ర్భంగా ఫ‌స్ట్ గ్లింప్స్ విడుద‌ల చేశారు. ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌ భీమ్లా నాయ‌క్ పాత్ర‌లో న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. ఫస్ట్ గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. ఇందులో పవన్ కోపంతో ఒరేయ్ డానీ బ‌య‌ట‌కు రారా.. నా కొడ‌కా అని పిలుస్తూ యాక్షన్ విందు చేశారు.

ప‌వ‌న్ బ్లాక్ క‌ల‌ర్ ష‌ర్ట్‌, లుంగీలో ఫైటింగు చేస్తూ, కోపంతో ఊగిపోతూ ఇందులో క‌న‌ప‌డుతున్నారు. సంక్రాంతి సంద‌ర్భంగా వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 12న ఈ సినిమా విడుద‌ల కానుంద‌ని ఈ సినిమా యూనిట్ ప్ర‌క‌టించింది. సెప్టెంబర్‌ 2 నుంచి ఈ సినిమా పాటలు విడుద‌ల‌వుతాయ‌ని పతెలిపింది. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీస‌ర్ గా క‌నప‌డ‌నున్నారు. సాగ‌ర్ చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమాను సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్య దేవ‌ర నాగ‌వంశీ తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సాయిప‌ల్ల‌వి, ఐశ్వ‌ర్య రాజేశ్ కూడా న‌టిస్తున్నారు.

YouTube video

ఇది కూడా చదవండి: ప్రధానిగా 8వ సారి ఎర్రకోటపై త్రివర్ణపతాకం ఎగురవేసిన మోదీ

Advertisement

తాజా వార్తలు

Advertisement