Wednesday, May 1, 2024

పారిజాత ప‌ర్వం ఫ‌స్ట్ లుక్…

సునీల్‌, శ్రద్ధా దాస్‌, చైతన్య రావు, మాళవిక సతీశన్‌ ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రానికి టైటిల్‌ ఖరారైంది. సంతోష్‌ కంభంపాటి దర్శకత్వంలో మహిధర్‌ రెడ్డి, దేవేష్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పారిజాత పర్వం అనే ఆసక్తికరమైన -టైటిల్‌ ని పెట్టారు. -టైటిల్‌ పోస్టర్‌ కూడా చాలా ఆసక్తిగా వుంది. ఓ అమ్మాయికి ముసుగు వేసి కుర్చీలో బంధించినట్లు- విడుదల చేసిన -టైటిల్‌ లుక్‌ పోస్టర్‌ ఆసక్తిని పెంచింది. ఈ చిత్రంలో వైవా హర్ష, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, సురేఖ వాణి, సమీర్‌ , గుండు సుదర్శన్‌ ఇతరకీలక పాత్రలు పోషిస్తున్నారు.
బాల సరస్వతి కెమరామెన్‌ గా పని చేస్తున్న ఈ చిత్రానికి రీ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి అనంత సాయి సహ నిర్మాత.
సునీల్‌, శ్రద్ధా దాస్‌, చైతన్య రావు, మాళవిక సతీశన్‌, వైవా హర్ష, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, సురేఖ వాణి, సమీర్‌ , గుండు సుదర్శన్‌ , జబర్దస్త్‌ అప్పారావు, టార్జాన్‌ , గడ్డం నవీన్‌ ,తోటపల్లి మధు, జబర్దస్త్‌ రోహిణి తదితరులు నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement