Friday, April 26, 2024

పాన్ ఇండియా మూవీ పోస్ట్ థియేట్రికల్ రైట్స్ సోంతం చేసుకున్న ప్రైమ్ వీడియోస్

ఉపేంద్ర, శ్రియ శరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన పాన్ ఇండియన్ మూవీ కబ్జా. ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కిచ్చా సుదీప, శివ రాజ్‌కుమార్ అతిధి పాత్రలు పోషించారు. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా మూవీ ప్ర‌మోష‌న్స్ తో ప్రేక్షకులలో సినిమాపై డీసెంట్ హైప్ ని అయితే క్రియేట్ చేసింది.

అయితే, ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా పోస్ట్ థియేట్రికల్ డిజిట‌ల్ స్ట్రీమింగ్ హక్కులను ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో కైవసం చేసుకున్నట్లు తాజా స‌మాచారం. సినిమా ఓపెనింగ్ క్రెడిట్స్ అప్పుడు కూడా అదే ప్రదర్శించబడింది. ఇక ఈ సినిమాలో ఒక వ్యక్తి అనుకోని విధంగా అండ‌ర్ వ‌రల్డ్ డాన్ గా ఏలా మార‌తాడు అనేది మూవీ ప్లాట్ స్టోరీ అనుకోవ‌చ్చు.

శివ రాజ్‌కుమార్, దేవ్ గిల్, కోట శ్రీనివాసరావు, మురళీ శర్మ, సుధ, జాన్ కొక్కెన్, సుధ, అనూప్ రేవణ్ణ, దేవ్ గిల్ కీలక పాత్రలు పోషించారు. ఆర్ చంద్రు కథ, స్క్రీన్‌ప్లే రాయడమే కాకుండా భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించారు. యాక్షన్ డ్రామాకి రవి బస్రూర్ బాణీలు సమకూర్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement