Friday, November 15, 2024

మార్కెట్ లో మారుతి సుజుకి బ్రెజ్జా S-CNG.. ధర, వేరియంట్లు వివరాలు

మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ జనవరిలో గ్రేటర్ నోయిడాలో ఆటో ఎక్స్‌పోలో CNG-స్పెక్ బ్రెజ్జా కాంపాక్ట్ SUVని ఆవిష్కరించింది. మారుతి సుజుకి తన S-CNG పోర్ట్‌ఫోలియోను విస్తరించాలని చూస్తున్నందున ఇది CNG పవర్‌ట్రెయిన్‌ను కలిగి ఉన్న మొదటి కాంపాక్ట్ SUVగా మారింది.

బ్రెజ్జా S-CNG K-సిరీస్ 1.5L డ్యూయల్ జెట్, డ్యూయల్ VVT ఇంజన్‌తో శక్తిని పొందుతుంది. అయితే, బ్రెజ్జా S-CNG గరిష్ట పవర్ అవుట్‌పుట్ 64.6kW@5500rpm అండ్ 121.5Nm గరిష్ట టార్క్ @4200rpm. CNG SUV 25.51 km/kg ఇంధన సామర్థ్య రేటింగ్‌ను కలిగి ఉంది.

మారుతి సుజుకి బ్రెజ్జా S-CNG 5-స్పీడ్ మాన్యువల్ గేర్ ట్రాన్స్‌మిషన్, మూడు వేరియంట్‌లు – LXi, VXi, ZXi – డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంది. బ్రెజ్జా S-CNG లో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, క్రూయిస్ కంట్రోల్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన స్మార్ట్‌ప్లే ప్రో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కీలెస్ పుష్ స్టార్ట్, వంటి ఫీచర్ల కూడా ఉన్నాయి.

- Advertisement -

రెగ్యులర్ మారుతి సుజుకి బ్రెజ్జా బేస్ వేరియంట్ ధర రూ.8.20 లక్షలు. CNG వేరియంట్ LXi, VXi, ZXi, ZXi డ్యూయల్ టోన్ అనే నాలుగు గ్రేడ్‌ల విస్తృత శ్రేణిలో అందుబాటులో ఉంది. కాగా, రెగ్యులర్ పెట్రోల్-ఇంజిన్ వేరియంట్‌లతో పోలిస్తే, సంబంధిత CNG వెర్షన్‌లు దాదాపు రూ.1 లక్ష డిఫరెనెస్స్ ఉంటుంది.

బ్రెజ్జా S-CNG వేరియంట్లు ఎక్స్-షోరూమ్ ఫ్రైజ్

LXi S-CNG- 9,14,000
VXi S-CNG-10,49,500
ZXi S-CNG-11,89,500
ZXi S-CNG Dual Tone- 12,05,500

దేశంలో అతిపెద్ద కార్ల ఉత్పత్తి సంస్థ బ్రెజ్జా CNG బుకింగ్‌లను అధికారికంగా ప్రారంభించింది, ప్రారంభ టోకెన్ ధర రూ.25,000 ఉండనుంది. కస్టమర్ డెలివరీలు రాబోయే నెలల్లో జరుగుతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement