Saturday, May 4, 2024

ఈ మోస్ట్ అవైటెడ్ సినిమాలు కూడా ఓటీటీలోనే విడుద‌ల..?

కరోనా అన్ని రంగాలను కుదిపేస్తోంది..ముఖ్యంగా సినిమా రంగాన్ని గత ఏడాదిన్నర నుంచి భారీగా కుదిపేస్తోంది. ఇప్పటికి క‌రోనా పరిస్థితులు పూర్తిగా స‌ద్ధుమ‌ణ‌గ‌లేదు, మ‌ళ్లీ థ‌ర్డ్ వేవ్ భ‌యం ఉండ‌డంతో థియేట‌ర్స్‌లో సినిమాలను విడుద‌ల చేసేందుకు నిర్మాత‌లు జంకుతున్నారు. ఈ క్ర‌మంలో ఓటీటీలో కొన్ని సినిమాలు విడుద‌లకు సిద్ధ‌మ‌య్యాయ‌నే ప్ర‌చారం న‌డుస్తుంది. వెంక‌టేష్ న‌టించిన దృశ్యం 2, నార‌ప్ప చిత్రాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉండ‌గా, వీటిని ఓటీటీలోనే విడుద‌ల చేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. మ‌రోవైపు రానా న‌టించిన విరాట ప‌ర్వం కూడా ఓటీటీలో విడుద‌ల కానుంద‌నే ప్ర‌చారం న‌డుస్తుంది. ఇన్ని రోజులు మేకర్స్ థియేట్రికల్ రిలీజ్ కే స్టిక్ అయ్యి ఉన్నారు కానీ ఇప్పుడు ఓటిటికే ఓటు వేసినట్టు తెలుస్తుంది. విరాట ప‌ర్వం చిత్రం ఓటీటీలో విడుద‌ల కానుంద‌ని కొన్నాళ్లుగా ప్రచారం న‌డుస్తుంది. ఈ క్ర‌మంలో అవాస్త‌వాలు న‌మ్మోద్ద‌ని చెబుతున్న‌ప్ప‌టికీ ఓటీటీలో విడుద‌ల కానుంద‌నే పుకార్లు ఆగ‌డం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement