Saturday, July 27, 2024

OTT Partners | “గామి” డిజిట‌ల్ రైట్స్ ఆ సంస్థకే

మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ ప్రధాన పాత్రలో, విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ గామీ. మార్చి 8న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి, టీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీ నాన్ థియేట్రికల్ పార్టనర్స్ పై తాజాగా ఒక క్లారిటీ వచ్చింది.

ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను జీ 5 సొంతం చేసుకోగా, జీ తెలుగు ఛానెల్ సినిమా శాటిలైట్ రైట్స్ ను దక్కించుకుంది. చాందినీ చౌదరి, MG అభినయ, మహమ్మద్ సమద్, దయానంద్ రెడ్డి మరియు హారిక పెడద కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement