Thursday, May 16, 2024

Teaser | ఇంట్రెస్టింగ్ గా “ఓం భీమ్ బుష్” టీజర్

హుషారు ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ గా తెర‌కెక్కుతున్న మూవీ ‘‘ఓం భీమ్ బుష్’’ శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ టీజర్‌‌ను రిలీజ్ చేశారు మేకర్స్‌.

శ్రీవిష్ణు తన అద్భుతమైన కామిక్ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలకు మంచి రోల్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్, రచ్చ రవి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీత దర్శకుడు సన్నీ ఎంఆర్ పర్ఫెక్ట్ మూడ్ క్రియేట్ చేశారు. శ్రీకాంత్ రామిశెట్టి ఆర్ట్ డైరెక్టర్ కాగా, విజయ్ వర్ధన్ ఎడిటర్. ఓం భీమ్ బుష్ మార్చి 22న థియేటర్ల లో రిలీజ్ కానుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement