Saturday, July 27, 2024

Akhanda 2 | అక్టోబర్ నుంచి మొదలుకానున్న “అఖండ 2”

బాలయ్య – బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన అఖండ అద్భుత విజయాన్ని సాధించింది. దీంతో ‘అఖండ 2’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఈ సీక్వెల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా.. ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని బాలయ్య ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ ఏడాది అక్టోబర్ నుంచి ఈ సినిమా స్టార్ట్ కాబోతుంది అని తెలుస్తోంది. బోయపాటి శ్రీను ఇప్పటికే ‘అఖండ 2’ స్క్రిప్ట్ పూర్తి చేశాడు. ప్రస్తుతం డైలాగ్ వెర్షన్ పై కసరత్తులు చేస్తున్నారు.

కాగా ‘అఖండ 2’ లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా ఓ కీలక పాత్రలో నటించబోతునట్లు తెలుస్తోంది. అందుకే, ‘అఖండ 2’ సినిమా పై నార్త్ లో కూడా బజ్ ఉంటుంది అని టాక్. ఇక ఈ కథలో సోషియో ఫాంట‌సీ ఎలిమెంట్స్ ఉంటాయని.. మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని.. బాలయ్య నుంచి మరో వినూత్న సినిమా రాబోతుందని చెబుతున్నారు. అలాగే, బోయపాటి మార్క్ యాక్షన్ సీన్స్ అండ్ పొలిటికల్ పంచ్ లు మాత్రం సినిమాలో ఫుల్ గా ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం బాలయ్య.. డైరెక్టర్ బాబీతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement